బ్యాంకాక్ చెక్కేయనున్న రామ్ చరణ్ టీం

బ్యాంకాక్ చెక్కేయనున్న రామ్ చరణ్ టీం

Published on Jul 24, 2015 12:27 AM IST

Ramcharan
సూపర్బ్ కామెడీకి యాక్షన్ అంశాలను మిక్స్ చేసి ఆడియన్స్ ని మెప్పించే శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 9వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఇతర నటీనటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ అండ్ టీం త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ కి పేకప్ చెప్పి బ్యాంకాక్ వెళ్లనున్నారు. టీం నుంచి అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ నెల 25 లేదా 26వ తేదీన ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు.

ఈ బ్యాంకాక్ షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్, కొన్ని కీ సీన్స్ తో పాటు ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారు. మెయిన్ టీం మొత్తం బ్యాంకాక్ వెళ్లనున్నారు. రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమా ద్వారా అరుణ్ విజయ్ విలన్ గా పరిచయం కానున్నాడు. కృతి కర్భంద, నదియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ హై రేంజ్ కామెడీ ఉంటుందని సమాచారం. గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల కోన వెంకట్ – గోపి మోహన్ లతో కలిసి చేయనున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు