మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగులో రామ్ చరణ్

మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగులో రామ్ చరణ్

Published on Mar 4, 2015 12:39 PM IST

ram-charn-srinu-vatila
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కనున్న సినిమా ముహూర్త కార్యక్రమాలు గురువారం నాడు జరగనున్నాయి. మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బందా రామ్ చరణ్ సిస్టర్ పాత్రలో నటిస్తుంది.

ఒకప్పటి హిట్ కాంబినేషన్ దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత ద్వయం కోన వెంకట్, గోపి మోహన్ లు మళ్లీ ఈ సినిమాతో ఒక్కటవుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కొలవేరి డి’ ఫేం అనిరుధ్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా దర్శకనిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు.

తాజా వార్తలు