ముద్దుగుమ్మ ఛార్మీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి సినిమాలో నటిస్తుందని 123తెలుగు ముందుగానే తెలిపింది. ప్రాజెక్ట్ తెలిపిన వెనువెంటనే ఈ సినిమా జ్యోతిలక్ష్మి జీవితకధను ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు పుకార్లు వినిపించాయి. జ్యోతిలక్ష్మి 70,80 ల దశకంలో ఐటెంగర్ల్ గా ఒక ఊపు ఊపింది. ఈ పుకార్లను ఖండిస్తూ ఛార్మీ ఈ సినిమా ఎవరి జీవితగాధ కాదని తెలిపింది.
ఛార్మీకి హిట్ లేక చాన్నాళ్ళుగా ఒక నికార్సైన విజయంకోసం ఎదురుచూస్తుంది. ఛార్మీ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ అందాల భామ బరువు తగ్గే పనిలో వుంది


