నైట్ షూటింగ్లో బిజీగా ఉన్న చార్మీ

నైట్ షూటింగ్లో బిజీగా ఉన్న చార్మీ

Published on May 14, 2014 9:04 PM IST

charmi
ఇటీవలే విడుదలైన ‘ప్రతిఘటన’ సినిమా తర్వాత చార్మింగ్ బ్యూటీ చార్మీ ‘మంత్ర 2’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లోని ప్లెక్స్ హౌస్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో జరుగుతోంది. ప్రస్తుతం చార్మీ పై నైట్ ఎఫెక్ట్ లో వచ్చే సీన్స్ షూటింగ్ చేస్తున్నారు.

‘మంత్ర 2’లో చార్మీ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పాత్రలో కనిపించనుంది. దెయ్యం ఉన్న తన సొంత ఇంటిని అమ్ముకునే ప్రయత్నంలో చార్మీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అన్నదే ఈ సినిమా కథాంశం. సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి యాదగిరి రెడ్డి, శౌరి రెడ్డి నిర్మాతలు.

తాజా వార్తలు