గోవాలో ఛార్మీ వివాహం ?

charmi
మహా…మహా …మహా అంటూ ప్రేక్షకుల్ని ‘మంత్ర’ముగ్ధుల్ని చేసిన హీరోయిన్ ఛార్మీ. ఈరోజు నాకు పెళ్లంటూ ఛార్మి పెళ్లి బట్టలతో తన ట్విట్టర్‌ ఖాతాలో ఫోటో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా… లేక సినిమాలో భాగంగా పెళ్లీ సీన్ లో నటిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ .

తాను పెట్టిన ఫోటోలో తలకి బాసికం, పచ్చరంగు చీర కట్టుకుని అచ్చతెలుగు పెళ్లి కూతురిలా తయారైంది. ఇది చూసిన వారందరూ ఛార్మికి నిజంగానే పెళ్లా అని.. కంగారు పడ్డారు. ఇంతకీ ఈ వేషం ‘జ్యోతి లక్ష్మి’ కోసం వేసిందట అమ్మడు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మి’ చేస్తుందని తెలుగు. ఈ సినిమాతో ఛార్మి నిర్మాతగా కూడా మారింది. ఈ సినిమా షూటింగ్‌ లో భాగంగా పెళ్లి సీన్ సమయంలో సెల్పీ తీసుకొని ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిందని తెలుస్తోంది

Exit mobile version