
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి మరో ఐటెం సాంగులో సందడి చేయనుంది. రామ్ చరణ్ ‘నాయక్’, కింగ్ నాగార్జున ‘డమరుకం’, ‘రగడ’ సినిమాలలో చార్మి చేసిన ఐటెం సాంగులు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు చేస్తున్న ఐటెం సాంగ్ ఓ తమిళ సినిమా కోసం కావడం విశేషం.
చియాన్ విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ’10 ఎణ్రదుకుళ్ల’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాలో మంచి మాస్ మసాలా ఐటెం సాంగులో హీరో విక్రమ్ తో చార్మి చెందేస్తుంది. తమిళ స్టైల్లో సాగిపోయే ఈ పాట 9 నిమిషాలు ఉంటుంది. గురువారం నుండి ఈ పాట చిత్రీకరణ చెన్నైలో మొదలైంది. ఈ పాట కోసం 2.25 కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ సెట్ వేశారని సమాచారం.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కమెడియన్ పాత్రలో నటిస్తున్నాడు. ఏఅర్ మురుగదాస్ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది.