
తెలుగు హీరోయిన్ గానే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ ఛార్మీ.. ఛార్మీ ప్రస్తుతం ‘జ్యోతి లక్ష్మీ’ సినిమాతో బిజీగా ఉంది. తాజాగా ఛార్మీ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. గోవాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నప్పుడు తన సహా ఫైటర్ చేతి నుంచి హాకీ స్టిక్ జారిపోవడంతో అది కాస్తా ఛార్మీ ఫేస్ కి తగిలి గాయమైంది.
అక్కడి నుంచి ఛార్మీని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ తన ట్రీట్ మెంట్ చేసి, 6 గంటలు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సెట్స్ పైకి వచ్చి జస్ట్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఆ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసింది. దాంతో ఈ చిత్ర టీం ఛార్మీ ప్రొఫెషనలిజం చూసి మెచ్చుకున్నారు. ప్రసతుతం ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఛార్మీ ప్రస్తుతం జ్యోతి లక్ష్మీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.