తప్పు తెలుసుకొని సారీ చెప్పిన ఛార్మీ

తప్పు తెలుసుకొని సారీ చెప్పిన ఛార్మీ

Published on Jun 16, 2015 10:55 AM IST

charmee-i
గత కొద్ది రోజులుగా అందాల భామ ఛార్మీ ఫిల్మ్ నగర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. దానికి కారణం తను నటించిన జ్యోతిలక్ష్మీ సినిమా గత వారమే రిలీజ్ అవ్వడం ఒకటి అయితే, మరొకటి నితిన్ – పూరి సినిమాపై వివాదాస్పద వాఖ్యలు చేయడం మరొకటి.. ఇక అసలు విషయంలోకి వెళితే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది. కానీ దానివెనకున్న కారణం ఛార్మీ అని పలువురు చెప్పుకున్నారు.

ఇదే విషయాన్నీ రీసెంట్ ఇంటర్వ్యూలో చార్మీని అడిగితే ఫైనాన్సియల్ సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని చెప్పింది. ఛార్మీ చేసిన ఈ కామెంట్ చాలా మంది ప్రొడక్షన్ హౌస్ లకు కోపం తెప్పించింది, అంతే కాకుండా నితిన్ మరియు అతని ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఎలాంటి ఫైనాన్సియల్ ఇబ్బందుల్లోనూ లేదని వాళ్ళు కామెంట్స్ చేసారు. దాంతో అసలు విషయం తెలుసుకున్న ఛార్మీ తప్పు తనదే అని ట్విట్టర్ ద్వారా సారీ చెప్పింది. ‘కొంతమంది నితిన్ – పూరి సినిమా ఆగిపోవడానికి ఫైనాన్సియల్ ఇబ్బందులే కారణం అని చెప్పారు, అది నిజమని నమ్మి నేను కామెంట్ చేసాను. అది తప్పని తెలిసింది.. అందుకే నేను సారీ చెప్తున్నానని’ ఛార్మీ తెలిపింది.

తాజా వార్తలు