‘చారుశీల’.. నా ఫేవరైట్ : శృతి హాసన్

Shruti-Haasan
సూపర్ స్టార్ మహేష్ బాబు – అందాల తార శృతి హాసన్ ఈ ఇద్దరి జంట తెరపై ఎలా ఉండనుందనే విషయం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ పోస్టర్లు, సాంగ్ ట్రైలర్ల ద్వారా ఇప్పటికే తెలిసిపోయింది. ‘జతకలిసే’, ‘చారుశీలా’ అంటూ ఇద్దరూ ఆడిపాడడం చూశాక, మహేష్-శృతిల జంట చాలా ఫ్రెష్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఇదే విషయమై శృతి హాసన్ మాట్లాడుతూ.. మహేష్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, సినిమా షూటింగ్ మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో తనకు అన్ని పాటలూ నచ్చాయని చెబుతూ, అన్నింటికంటే చారుశీల పాట తనకు బాగా ఇష్టమని శృత హాసన్ తెలిపింది. చారుశీల పాటలో మైఖేల్ జాక్సన్ స్టైల్ కనిపిస్తుందని, దేవిశ్రీ రిథమ్ ఏ పాటకైనా మంచి అందాన్ని తెచ్చిపెడుతుందని చెబుతూ, చారుశీల పాట సినిమాలోని తన పాత్ర చుట్టూ తిరిగేదే కావడంతో ‘శ్రీమంతుడు’లో తన ఫేవరైట్ చారుశీలే అని శృతి హాసన్ తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో శృతి హాసన్ పేరు కూడా చారుశీలే! దేవిశ్రీ ఈ పాటకు ట్యూన్ కట్టినప్పుడే చారుశీల అనే పేరు తట్టడం, అదే పేరు శృతి హాసన్ పేరుకూ పెట్టడం జరిగిపోయిందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. మైత్రీ మూవిస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!

Exit mobile version