చైతు కామెంట్స్ తో అంచనాలు పెరిగాయి !

చైతు కామెంట్స్ తో అంచనాలు పెరిగాయి !

Published on Dec 5, 2019 12:23 AM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. కాగా చిత్రబృందం ఈ రోజు ప్రెస్‌ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా చైతు మీడియాతో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘వెంకీ మామ’ చిత్రం తన కెరీర్‌లో మరో ‘మనం’ అవుతుందని తెలిపారు. చైతు ఈ సినిమాని మనం లాంటి క్లాసిక్ మూవీతో పోల్చడంతో సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు