‘భారతీయుడు-2’ నుంచి మరో హిట్ ట్రాక్

‘భారతీయుడు-2’ నుంచి మరో హిట్ ట్రాక్

Published on May 29, 2024 6:00 PM IST

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు-2. కాగా జూలై 12, 2024న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో.. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ అయింది. సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య “చెంగలువ” అంటూ సాగే ఈ లవ్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ మెలోడీ సాంగ్ లోని సాహిత్యం కూడా చాలా బాగుంది.

ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్ జూన్ 1 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు