సూర్య ఫ్యాన్స్ ఆశలను ఆవిరి చేసిన చెన్నై హైకోర్టు

Published on May 30, 2019 5:01 pm IST

చెన్నై లో సూర్య ఫ్యాన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కట్అవుట్ 215 అడుగులతో ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పారు. ఇంకొన్ని గంటలలో సూర్య “ఎన్ జి కె” థియేటర్లలో సందడి చేయనున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వెంటనే ఆ కట్ అవుట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయం వెనుక కారణాలను తెలుపుతూ, గతంలో ఇలానే విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల కట్ అవుట్లకు పూలమాలలు, పాలాభిషేకాలు చేయడానికి ప్రయ్నతించి కొందరు ప్రాణాలు కోల్పోయారు అని వివరణ ఇచ్చింది. దాదాపు 7లక్షల రూపాయల తో 40 మంది కార్మికులు, నెలరోజులపైన పనిచేస్తే కానీ ఆ కట్ అవుట్ నిర్మాణం పూర్తి కాలేదట.

సంబంధిత సమాచారం :

More