కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఒక్క కట్ కూడా సూచించకుండా ‘U/A’ సర్టిఫికేట్‌ను కేటాయించింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ విషయానికి వస్తే.. 179 నిమిషాలు (2 గంటల 59 నిమిషాలు) గా లాక్ అయింది. లవ్ స్టోరీ జోనర్‌కు ఈ నిడివి కాస్త ఎక్కువే అయినప్పటికీ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటే ఆడియన్స్‌కు ఇది పెద్ద సమస్యేమీ కాదు.
గతంలో SKN, సాయి రాజేష్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బేబి’ కూడా దాదాపు మూడు గంటల రన్‌టైమ్‌తోనే వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే బాటలో ప్రొడ్యూస్ అయిన ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా ‘బేబి’ లాగే థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.


