చెన్నై లవ్ స్టోరీ : హౌస్‌ఫుల్ బోర్డుతో థియేటర్లు.. కిరణ్ అబ్బవరం క్రేజ్ ఇది..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ముఖ్యంగా మెయిన్ సెంటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.

హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ 70 MM వంటి క్రేజీ థియేటర్‌లో ఈ సినిమా ఫస్ట్ షో హౌస్‌ఫుల్ కావడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ స్పందిస్తూ.. సినిమాకి రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతోందని తెలిపారు. ఇంకా పలు థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో కిరణ్ అబ్బవరం అభిమానులు, చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రవి నంబూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version