టాలీవుడ్ కి ‘అర్ధనారి’ వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించిన విధానం.. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది.
