చిరు సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన చిన్ని కృష్ణ

Chinni-Krishna
మెగా స్టార్ 150వ సినిమా వెనుక నా హస్తం వుందని ప్రముఖ రచయితా చిన్ని కృష్ణ చెప్పుకొస్తున్నాడు. ఈ రచయిత కధనం ప్రకారం తను ఎప్పట్నుంచో చిరు 150వ సినిమా గురించి కష్టపడుతున్నట్లు ఆ సినిమా ఇంద్రని మించిన చిత్రమవుతుందని తెలిపాడు

గతంలో చిన్ని కృష్ణ కొన్ని సూపర్ హిట్ సినిమాలకు కధలను అందించాడు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన ఈ దర్శకుడు నిజంగా చిరు ప్రాజెక్ట్ లో వున్నాడో లేడో తెలియాల్సి వుంది. పల్లెకోన గ్రామంలో ఒక వేడుకకు హాజరైన సందర్భంలో చిన్ని కృష్ణ ఈ సంచలన వార్తలు చేసాడు

ప్రస్తుత పరిస్థితులలో చిరంజీవి 150వ సినిమా సంచలన వార్తగా నిలిచింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో ఎవరు పాల్గున్నా వాళ్ళ కెరీర్ గ్రాఫ్ పెరిగే సూచనలు వున్నాయి. ఇటువంటి మరిన్ని వ్యాఖ్యలు ఆగష్టు 22వరకూ వినక తప్పదేమో

Exit mobile version