ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీ ప్రొమోషన్స్ కార్యక్రమాలలో బిజీ గా ఉన్నారు. వచ్చే నెల 2న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో వివిధ భాషలలో ప్రచారం కలిపించే పనిలో ఉన్నారు. నిర్మాత రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఐదు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
కాగా తమిళ చిత్ర పరిశ్రమకు రజిని, కమల్ రెండు కళ్ళు లాంటి వారు. భిన్నమైన ఇమేజ్ కలిగిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతూ వస్తున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించేశారు. కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీ స్థాపించడంతో పాటు, పార్టీ శ్రేణులను సమీకరించడమే కాకండా, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. ఇక రజిని త్వరంలోనే పార్టీ పేరు ,సింబల్ ప్రకటించనున్నట్లు తెలిపారు.
కాగా ఆంధ్రా రాజకీయాలలో చిరంజీవి అనుభవం దృష్ట్యా వారిద్దరికీ చిరు ఓ అమూల్యమైన సలహా ఇచ్చారట. రాజకీయాలను ధన ప్రాభల్యం, కుల ప్రాతిపదికన నడుస్తున్నప్పుడు, రాజకీయాలలోకి వచ్చి సమయం వృధాచేసుకోవడం అనవసరం అని అన్నారట. ఇందుకు నేను,మా తమ్ముడు పవన్ కళ్యాణ్ నే ఉదాహరణ అని ఆయన వారిద్దరికీ ఓ ఉచిత సలహా ఇచ్చారట. చిరు 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, 2009 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. గతంలో రజిని పలు వేడుకలలో చిరు రాజకీయాలలోకి రావాలని ప్రోత్సహించడం గమనార్హం.


