
టాలీవుడ్ మెగాస్టార్ 2007లో చేసిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాతో సినిమాలను పక్కనబెట్టి రాజకీయ బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయ ప్రస్థానం సరిగా లేకపోవడంతో మళ్ళీ సినిమాలపై చిరంజీవి దృష్టి పెట్టాలనుకుంటున్నాడని మేము ఇది వరకే తెలిపాము. అందులో భాగంగా చిరు నటించబోయే 150వ సినిమాకి సంబందించిన గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు.
గతంలో చిరు 150వ సినిమాని రామ్ చరణ్ నిర్మించే అవకాశం ఉందని అన్నారు. కానీ తాజాగా మేము విన్న సమాచారం ప్రకారం గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరుకి బాగా తెలిసిన వివి వినాయక్ లాంటి దర్శకులు చిరు 150వ సినిమాకి సంబందించిన కథ అన్వేషణలో ఉన్నారు.
ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 22న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..