త్రివిక్రమ్ సినిమా గురించి రివీల్ చేసిన చిరు

త్రివిక్రమ్ సినిమా గురించి రివీల్ చేసిన చిరు

Published on Sep 29, 2019 10:00 PM IST

మెగాస్టార్ చిరు అభిమానుల ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. ఎప్పటికైనా గురూజీతో చిరు సినిమా చేస్తే చూడాలనేది వారి కోరిక. ఆ కోరిక త్వరలోనే తీరేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా టీవీ, పత్రికా మాధ్యమాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారాయన. వాటిలో ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావించారు.

త్రివిక్రమ్ తనకు ఒక లైన్ చెప్పాడని, ప్రస్తుతం వర్క జరుగుతోందని, ఆ సినిమా వంద శాతం ఎంటెర్టైనర్ అని అన్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ అనిపిస్తోంది. ఇకపోతే చిరు తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొడలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు