టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సీనియర్ హీరోల్లో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ఒక సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలెక్కిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. మెగాస్టార్ రీసెంట్గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక బాలయ్య ‘అఖండ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు తమ నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఈసారి ఈ ఇద్దరు చేయబోయే సినిమాలు ఒకే నేపథ్యంలో సాగనుండటం వివేషం. చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రాబోయే సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ చిత్రమని మేకర్స్ చెబుతున్నారు. అటు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తొలుత ఓ పీరియాడిక్ కథను అనుకున్నా, ఇప్పుడు ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని తెలుస్తోంది.
ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే నేపథ్యంలో సాగే సినిమాలను చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ రెండు సినిమాలను కూడా 2026 చివరినాటికి రిలీజ్ అయ్యేలా ఈ ఇద్దరు హీరోలు ప్లాన్ చేస్తున్నారు.
