Pic Talk : ఆత్మీయ విందులో టాలీవుడ్ ఉద్ధండులు.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

Pic Talk : ఆత్మీయ విందులో టాలీవుడ్ ఉద్ధండులు.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

Published on Apr 9, 2026 11:00 AM IST

nagarjuna

టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండగే. తాజాగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఉన్న ఓ అందమైన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ మహేష్ రెడ్డికి డాక్టరేట్ దక్కిన సందర్భంగా నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆత్మీయ విందులో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది.

ఆత్మీయ పలకరింపులు..

ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున ఒకేచోట చేరి కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకోవడం అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) కూడా సందడి చేశారు. నాగార్జున నవ్వుతూ రఘురామ కృష్ణరాజుతో కరచాలనం చేస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పక్కనే ఉన్న చిరంజీవి వారి సంభాషణను ఆస్వాదిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ లేటెస్ట్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘విశ్వంభర’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మెగా 158’ పనుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు, ఆరు నెలల క్రితం విడుదలైన ‘కుబేర’ విజయంతో పాటు, రజినీకాంత్ ‘కూలీ’తో మంచి జోరుమీదున్న కింగ్ నాగార్జున.. ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 100వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఇలాంటి టైట్ షెడ్యూల్స్ మధ్య కూడా కాస్త సమయం తీసుకుని, ఈ ఇద్దరు స్టార్స్ మహేష్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత చిరు, నాగ్ ఇలా ఒకే వేదికపై సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించడంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ ఫోటో హాట్ టాపిక్‌గా మారింది.

వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీ..

ప్రస్తుతం ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ లేటెస్ట్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘విశ్వంభర’తో పాటు మెగాస్టార్ చిరంజీవి.. మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మెగా 158’ పనుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలెక్కనుంది.

మరోవైపు, శేఖర్ కమ్ముల ‘కుబేర’, రజినీకాంత్ ‘కూలీ’తో మంచి జోరుమీదున్న కింగ్ నాగార్జున.. ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 100వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఇలాంటి టైట్ షెడ్యూల్స్ మధ్య కూడా కాస్త సమయం తీసుకుని, ఈ ఇద్దరు స్టార్స్ మహేష్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత చిరు, నాగ్ ఇలా ఒకే వేదికపై సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించడంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ ఫోటో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు