మెగా బయోగ్రఫీ రాబోతుంది

మెగా బయోగ్రఫీ రాబోతుంది

Published on Jan 20, 2024 7:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన బయోగ్రఫీ తీసుకురాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగించినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నేను పెద్ద స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి కామెంట్స్ చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట విశ్వంభర చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లోని వీఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అట. మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు