మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలని అనుకున్నారో ఆ ఆశను ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నెరవేర్చింది. సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఈ సినిమా విజయయాత్ర కొనసాగుతుండగా, అదే జోరులో చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి మరోసారి కలిసి పని చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఈ చిత్ర పోస్ట్ రిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరంజీవి, అనిల్ రావిపూడి, వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు త్వరలోనే అనిల్‌తో మరో ప్రాజెక్ట్ చేయాలని, వెంకటేష్‌తో కలసి ప్రత్యేక పాత్రైనా లేదా పూర్తి స్థాయి పాత్రైనా చేయడానికి సిద్ధమని తెలిపారు. దీనికి వెంకీ కూడా సానుకూలంగా స్పందించడంతో, ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం వెంకటేష్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో భారీ చిత్రం వచ్చే అవకాశంపై టాక్ నడుస్తోంది. ఇది హిట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’కు సీక్వెల్ కావచ్చని టాక్. చిరంజీవి-వెంకటేష్-అనిల్ కాంబినేషన్ నిజమైతే, అది టాలీవుడ్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
