సమంత-రాజ్ లకు చిరు ‘స్పెషల్’ కంగ్రాట్స్.. సినిమా కోసం కాదండోయ్..!

స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా దూసుకుపోతుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో సామ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించాడు. సమంత లాంటి హీరోయిన్ యాక్షన్‌తో కూడా ప్రేక్షకులను మెప్పించడం విశేషమని ఆయన ఈ సందర్భంగా కొనియాడాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు ఎంతో అవసరమని పేర్కొంటూ.. ఈ భారీ విజయానికి కారణమైన సమంత, నందిని రెడ్డి, నిర్మాత రాజ్ సహా చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపాడు.

అంతేగాక, చిరు ఈ సందర్భంగా జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభిస్తున్న సమంత-రాజ్ లకు తన స్పెషల్ విషెస్ అంటూ పేర్కొన్నాడు. దీంత సమంత ప్రెగ్నెన్సీ పై వస్తున్న వార్తలకు చిరు బలం చేకూర్చారని చెప్పాలి. ఇటీవల సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. త్వరలోనే సమంత-రాజ్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఈ వార్తకు చిరు చేసిన కామెంట్ మరింత బలాన్ని అందించింది.

Exit mobile version