మీరు సాహసానికి మారు పేరు- చిరంజీవి

Published on May 31, 2020 11:39 am IST

మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ట్విట్టర్ వేదికగా కృష్ణ అరుదైన అఛీవ్మెంట్స్ ని గుర్తు చేసుకున్నారు. చిరు తన ట్విట్టర్ లో ”కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70ఎం ఎం చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు” అని తెలిపారు.

నటుడిగా,దర్శకుడిగా మరియు నిర్మాతగా కృష్ణగారి బహుముఖ ప్రజ్ఞను చిరంజీవి కొనియాడడం విశేషత సంతరించుకుంది. కృష్ణ గారిపై తనకున్న అభిమానాన్ని చిరు ట్వీట్ రూపంలో ఇలా తెలియజేశారు. అలాగే ఓ వేడుకలో చిరంజీవి, కృష్ణని కలినప్పటి ఫోటోను చిరంజీవి ట్విటర్ లో పోస్ట్ చేశారు. చిరంజీవి, కృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More