సైరా స్పెషల్ షోలో నాగ్, అఖిల్ !

Syeraa1

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం అద్భుతమైన పాజిటివ్‌ టాక్‌ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతొంది. దాంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఈ రోజు సినీ ప్రముఖుల కోసం సైరా ప్రత్యేక షోను వేశారు. నాగార్జున, అల్లు అర్జున్, అఖిల్ మరియు కొంతమంది సినీ ప్రముఖులు ఈ ప్రత్యేక షోకి వచ్చారు. సినిమా చూసిన వాళ్ళంతా సినిమా చాల బాగుందని మెగాస్టార్ కి అభినందనలు తెలిపారు.

అయితే బీజీ షెడ్యూల్ కారణంగా ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకాలేకపోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ షోకి వచ్చారు. సినిమా విడుదలకు ముందు సినిమా గురించి గొప్పగా మాట్లాడిన ఆయన, ఏఎంబి సినిమాస్ లో చిరు ఏర్పాటు చేసిన స్పెషల్ షోకు భార్యా పిల్లలతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఇక ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు నటించడంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version