కొరటాల కొత్తగా ప్లాన్ చేశాడట ?

Published on Sep 11, 2019 7:22 am IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట. వచ్చే వారంలో ఈ సినిమాకి సంబధించి ఆడిషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే చిరు లుక్ కి సంబంధించి ఇటీవలే ఓ టెస్ట్ షూట్ కూడా చేశారట. సినిమాలో మెగాస్టార్ గెటప్ ను కొరటాల కాస్త కొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న’ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More