తెలంగాణా గవర్నర్ ని కలిసిన చిరంజీవి..!

Published on Jun 3, 2020 7:18 am IST

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ నివాసం రాజ్‌ భవన్ లో గవర్నర్‌ను సతీసమేతంగా కలిసి అభినందనలు తెలిపారు. రాజ్‌ భవన్‌కు వచ్చిన చిరంజీవి దంపతులను గవర్నర్‌ దంపతులు స్వాగతించి మర్యాదపూర్వకంగా కాసేపు ముచ్చటించారు. పలు అంశాలపై చిరు గవర్నర్‌తో సంభాషించారు. ఈ భేటీ సందర్భంగా గవర్నర్‌ దంపతులు,చిరంజీవి దంపతులు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా నిభందనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక చిరంజీవి కొద్ది రోజులలో ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఓ సామాజిక అంశంతో కూడిన సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కూడా ఓ కీలక రోల్ చేయడం విశేషం. కాజల్ అగర్వాల్ మరోమారు చిరుకి జోడిగా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More