మేనల్లుడు తేజ్ కోసం మారుతీ కథను ఓకే చేసిన మెగాస్టార్

Published on May 30, 2019 4:00 am IST

సాయి ధరమ్ తేజ్ కోసం మారుతి ఒక కథను సిద్ధం చేసి, చిరంజీవి, అల్లు అరవింద్ లకు వినిపించాడట. కథ నచ్చడంతో ఈ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్లపై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ ను, హీరోయిన్ గా నేల టిక్కెట్టు భామ మాళవిక శర్మను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మాళవిక శర్మ.. ఆ తరువాత సరైన అవకాశాలు పట్టలేక పోయింది. తొలి సినిమా డిజాస్టర్‌ కావటంతో సోషల్‌ మీడియాను నమ్ముకొని అందాల విందు చేసింది. మొత్తానికి ఎలాగోలా మెగా మేనల్లుడుతో సరసాలాడే ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమానైనా అటు మాళవిక శర్మకు, ఇటు సాయి ధరమ్ తేజ్‌కు సరైన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More