ఎన్టీఆర్ తో చిరు తీపి జ్ఞాపకం..!

Published on May 28, 2020 9:50 am IST

సర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ తో తనకు గల తీపి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కీర్తిని తనదైన శైలిలో పొగిడిన చిరంజీవి, తెలుగు వారి ఆత్మ గౌరవంగా ఎన్టీఆర్ ని కొనియాడారు.
‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం…, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం… నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం…. వారితో కలిసి నటించడం నా అదృష్టం…పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ… ‘ అని ట్వీట్ చేశారు. దానితో పాటు ఓ సంధర్భంలో ఎన్టీఆర్, చిరు ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపిస్తున్న ఫొటో ఆయన పంచుకున్నారు.

ఇక తిరుగు లేని మనిషి చిత్రం కోసం ఎన్టీఆర్ మరియు చిరంజీవి కలిసి నటించడం జరిగింది. దర్శకుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ మూవీలో చిరంజీవి రోల్ కొంచెం నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఈ మూవీ వచ్చింది. ఇక ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ప్రముఖులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More