బాలయ్య సినిమాకి తన స్పెషల్ విషెస్ తెలిపిన చిరు.!

బాలయ్య సినిమాకి తన స్పెషల్ విషెస్ తెలిపిన చిరు.!

Published on Jan 18, 2024 7:05 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఇక మరోపక్క తన కో స్టార్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో ఓ మాసివ్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి చిరుతో వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం బాలయ్యతో తను వర్క్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా విషయంలో మెగాస్టార్ తన స్పెషల్ విషెస్ తెలియజేసారు అని బాబీ తెలిపాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాలయ్య గారితో సినిమా స్టార్ట్ చేసినపుడు తనకి కాల్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు అని మన సినిమా కంటే బాలయ్య గారితో పెద్ద హిట్ కొట్టాలని వారు చెప్పారని బాబీ తెలిపాడు. దీనితో బాలయ్య సినిమా విషయంలో చిరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు