రిలాక్సింగ్ మోడ్ లో చిరు

రిలాక్సింగ్ మోడ్ లో చిరు

Published on Oct 22, 2019 1:39 PM IST

మెగాస్టార్ కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా నరిసింహారెడ్డి ఊహించిన విధంగానే ఘనవిజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 135కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కొరకు ఎంత కష్టపడ్డారో, మూవీ ప్రొమోషన్స్ కొరకు అదే స్థాయిలో ఆయన చెమటోడ్చారు. ఎలాగైనా అన్ని భాషల ప్రేక్షకులకు మూవీని చేరువచేయాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాలలో తిరిగి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇక మూవీ విడుదలై ఫలితం రావడంతో చిరు రిలాక్స్ ఐయ్యారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలుకానున్న నేపథ్యంలో చిరు కొంత రిలాక్స్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. చిరు తన సమయం కుటుంబంతో గడపుతున్నారు. ఆయన తన మానవరాలితో ఆడుకుంటున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. సోషల్ డ్రామాగా తెరకెక్కనున్న కొరటాల మూవీపై మెగా అభిమానులలో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు