ఆగష్టు నుండి చిరంజీవి 150వ సినిమా.?

ఆగష్టు నుండి చిరంజీవి 150వ సినిమా.?

Published on May 11, 2014 10:21 AM IST

chiru
మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా గురించి చాలా రోజుల నుంచి సస్పెన్స్ లో ఉంది. ఈ సినిమా ఉంటుందా, ఉండదా అనే అంశాలపై తాజాగా కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం తన చిరంజీవి తన 150వ సినిమా గురించి ఆగష్టు 22న అనగా తన బర్త్ డే రోజున అనౌన్స్ చేస్తారని సమాచారం.

ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబందించిన విషయాలను సీక్రెట్ గా ఉంచారు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అలాగే చిరంజీవికి బాగా తెలిసిన వివి వినాయక్ లాంటి దర్శకులు చిరు రీ ఎంట్రీకి ఎలాంటి సినిమా సరిపోతుందా అని కథలను అన్వేషిస్తున్నారు.

ఈ సినిమాకి నిర్మాత, డైరెక్టర్ ఎవరు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్ అని చెప్పాలి. చిరంజీవి మళ్ళీ తెరపైకి వస్తాననడంతో మెగా ఫాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.

తాజా వార్తలు