మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా ఆదివారం నుండే భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్లతో థియేటర్లలోకి రాబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక ఓవర్సీస్లో మెగాస్టార్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 650K డాలర్ల మార్కును క్రాస్ చేసి, వేగంగా 1 మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్నాయి. టాలీవుడ్లో మరే ఇతర సీనియర్ హీరోకు సాధ్యం కాని రీతిలో, ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి ఖాతాలో ఇది రెండో 1 మిలియన్ డాలర్ ప్రీమియర్ మూవీగా రికార్డు సృష్టించబోతోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో క్యాథరిన్ ట్రెసా, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మెగాస్టార్ తన మార్కు కామెడీ మరియు ఎమోషన్స్‌తో బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


