లుక్ టెస్ట్ కి రెడీ అవుతున్న మెగాస్టార్ !

Published on Aug 8, 2019 7:15 pm IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే వారంలో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరగనుందట. ఈ లుక్ టెస్ట్ ను బట్టే సినిమాలో మెగాస్టార్ గెటప్ ను డిసైడ్ చెయ్యాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది.

ఇక కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇక మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More