ఎట్టకేలకు చిరు బయటికొస్తున్నారు

Published on Oct 29, 2020 1:04 am IST

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే కొంత భాగం షూట్ ముగియగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. లాక్ డౌన్ సడలింపులు జరిగాక చాలా సినిమాలు షూట్ రీస్టార్ట్ అయ్యాయి. కానీ ‘ఆచార్య’ మొదలుకాలేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో చిరు షూటింగ్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకే ఇన్ని రోజులు షూట్ మొదలుకాలేదు. దీంతో సినిమా మరింత ఆలస్యమైపోతుందని అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు.

అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతుండటంతో చిరు కూడా చిత్రీకరణ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ 3వ వారం నుండి షూట్ మొదలవుతుందట. అయితే ఈలోపే షూటింగ్ రీస్టార్ట్ చేసేసి ఇతర నటీనటుల మీద చిత్రీకరణ జరపనున్నారు. చిరు జాయిన్ అయ్యాక ఆయన మీద సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఆయనతో పాటు చరణ్ కూడ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :