ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం తెచ్చిపెట్టిన చిరు!

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత వెండితెరపై తన చరిష్మాను మళ్ళీ చూపించేందుకు 150వ సినిమాతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు చిరును తెరపై చూసేద్దామా? అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా, అభిమానుల్లో ఉత్సాహాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళేలా చిరంజీవి నిన్న సాయంత్రం ఇచ్చిన ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.

ప్రముఖ టీవీ చానల్ మా టీవీ ఏటా సినీ మా అవార్డ్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నిన్న 2015 సంవత్సరానికి సంబంధించిన అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని మా నిర్వహించింది. పలువురు స్టార్స్ హాజరవ్వగా, అంఅరంగ వైభవంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో చిరంజీవి ఓ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ వేడుక మొత్తానికీ చిరు డ్యాన్స్ మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ డ్యాన్స్ చూడాలంటే మా టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేసే రోజువరకూ ఎదురుచూడాల్సి ఉన్నా, కొందరు ఔత్సాహిక అభిమానులు మాత్రం నిన్న సాయంత్రమే మొబైల్స్ ద్వారా చిరు డ్యాన్స్‌ను రికార్డు చేశారు. ఇక ఆ డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆయన అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిరు ఈజ్ బ్యాక్ అని స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి 150వ సినిమా సెట్స్‌పైకి వెళుతోన్న ఈ సందర్భంలో ఆయన ఒక స్టేజ్ షోలో పర్ఫామెన్స్ ఇవ్వడం నిజంగానే అందరికీ ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేదిగానే చెప్పుకోవచ్చు.

Exit mobile version