ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన చిరంజీవి భార్య సురేఖ!

ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన చిరంజీవి భార్య సురేఖ!

Published on Feb 18, 2024 2:29 PM IST

నేడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రకటన చేస్తారని ఇటీవల సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఆమె చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాలని చాలా మంది ఎదురు చూస్తుండగా, అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించడం జరిగింది.

ముఖ్యంగా ప్రయాణీకులకు మంచి భోజనం అందించడంపై దృష్టి సారించి ఆమె అత్తమ్మ’ స్ కిచెన్‌ను పరిచయం చేసింది. భారతదేశంలో ప్రారంభించబడిన ఈ సర్వీస్ త్వరలో USAకి విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ను కూడా ప్రారంభించారు. సౌత్ లో ఉండే ట్రెడిషనల్ వంటలు ఇందులో ఉండనున్నాయి. అంతేకాక ఇందులో పలు రకాల వంటకాలను కూడా ఎక్స్పాండ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు