‘చిరు -బాబీ’ సినిమా షూట్ ఎప్పటినుంచి అంటే ?

Chiru Boby

మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సాధించిన భారీ విజయాన్ని ఆస్వాదించారు. ఐతే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక సినిమాకి సంబంధించి అధికారిక పూజా కార్యక్రమం కూడా ఈ నెలలో జరగనుందని తెలుస్తోంది.

అన్నట్టు మొదటి షెడ్యూల్ లో మెగాస్టార్ పై సోలో ఎంట్రీ షాట్స్ ను తీయనున్నారు. అనంతరం ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారట. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ.

కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

Exit mobile version