‘ఆదర్శ కుటుంబం’ కోసం ఆ సీక్వెన్స్ సిద్ధం చేస్తున్న వెంకీ..!

Aadarsha-Kutumbam-House

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఒక భారీ సెట్‌లో సినిమాకు అత్యంత కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు క్రైమ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, వెంకీ టైమింగ్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక మే నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది సెకండాఫ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే వెంకటేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని జూన్ లేదా జూలై నెల నుండి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రారంభించబోతున్నాడు. మరి వెంకీ ఈ రేంజ్ స్పీడులో సినిమాలు చేస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Exit mobile version