ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుత షెడ్యూల్ లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్‌లకు సంబధించి కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ప్రభాస్ పై ఎంట్రీ సాంగ్ ను షూట్ చేస్తారట. ఈ సాంగ్ లో ప్రభాస్ తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.
కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.
