
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బేస్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన టాలెంట్ తో తనకంటూ ఓ పెద్ద సంస్థానాన్నే క్రియేట్ చేసుకున్నాడు. సుమారు 37 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఎన్నో మరపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. గత కొంత కాలంగా రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ తన 150వ సినిమాతో మేకప్ వేసుకొని సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆగష్టు 22న చిరు తన 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ పుట్టిన రోజుని ఆయన స్పెషల్ గా తన అభిమానులతో కలిసి జరుపుకోవడానికి సిద్దమయ్యాడు.
ఇప్పటి వరకూ పలు సార్లు మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్స్ కి వచ్చి మెగా అభిమానులను పలకరించిన చిరంజీవి చాలా రోజుల తర్వాత ఆయన డైరెక్ట్ గా అభిమానుల ముందుకు రానున్నాడు. అభిమానుల ముందుకు రావడమే కాదు వారితో కలిసి తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అందులో భాగంగానే ఆగష్టు 22న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో బర్త్ డే మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ బర్త్ డే వేడుకలకి అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు తరలి వస్తున్నారు. ఈ వేడుక కోసం కొంతమంది మెగా అభిమానులు అబ్రాడ్ నుంచి కూడా వస్తుండడం విశేషం. ఇప్పటికే చిరు బర్త్ డే కోసం కటౌట్స్. హోర్డింగ్స్ ని భారీగా రెడీ చేస్తున్నారు. ఈ బర్త్ డే కి చిరు తన 150వ సినిమా స్టార్ట్ చేయకపోయినా త్వరలోనే స్టార్ట్ చేస్తానని అభిమానులకి తెలియజేయనున్నారు.