చిరు చెప్పిందే “హను మాన్” కి జరిగింది!

చిరు చెప్పిందే “హను మాన్” కి జరిగింది!

Published on Jan 15, 2024 11:10 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. చిన్న చిత్రం గా రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లో అదరగొడుతోంది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.

సినిమా బావుంటే, కంటెంట్ బాగుంటే ఫస్ట్ డే కాకపోతే రెండోరోజు చూస్తారు. లేదంటే ఆ నెక్స్ట్ డే, నెక్స్ట్ షో చూస్తారు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లిమిటెడ్ థియేటర్స్ నుండి అన్ లిమిటెడ్ హౌజ్ ఫుల్స్ అవుతున్నాయి. మేకర్స్ ఈ విషయం లో చాలా హ్యాపీ గా ఉన్నారు. ఈ చిత్రం లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు