ఆరోజు సావిత్రి గారి మాటలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి – చిరు

ఆరోజు సావిత్రి గారి మాటలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి – చిరు

Published on Apr 3, 2024 12:08 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర చెరగని ముద్ర వేసిన ఎందరి దిగ్గజ నటుల్లో అలనాటి చందమామ ‘మహానటి’ సావిత్రి గారు కూడా ఒకరు. మరి తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా తనదైన ముద్ర వేసిన ఆమెతో తనకున్న కొన్ని మధుర జ్ఞ్యాపకాలను అయితే మెగాస్టార్ చిరంజీవి నెమరు వేసుకున్నారు.

ఇటీవల జరిగిన సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా వెళ్లిన చిరు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పునాది రాళ్లు సమయంలో 1978 ఫిబ్రవరి నెలలో నరసింహరాజు గారు సావిత్రి గారితో సినిమా చేయబోతున్నాను అని చెప్పనపుడు నా ఒళ్ళు అంతా జలదరించింది అని..

ఆ తర్వాత తాను ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటి రెండు రోజుల తర్వాతే ఆవిడతో పరిచయం ఏర్పడడం తనని తాను చిరంజీవిగా పరిచయం చేసినపుడు ఆవిడ శుభం అని చెప్పారని అలా తర్వాత రోజు షూటింగ్ మధ్యలో వర్షం వచ్చినపుడు చిన్న జల్లు వస్తుంది ఆ సమయంలో ఎవరికీ ఏమీ తోచనపుడు సావిత్రి గారే అందరికి తన కోసం చెప్తూ చిరంజీవి అనే ఈ అబ్బాయి డాన్స్ బాగా చేస్తాడు అని పిలిచి చెయ్యమన్నారని తెలిపారు.

అలా చెప్పడమే ఆలస్యం తాను కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని నా టేప్ రికార్డర్ తోనే సాంగ్ పెట్టి వర్షం లో డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను ఆ సమయంలోనే కాలు స్లిప్ అయ్యి కింద పడినప్పటికీ నాగు పాములా ఏదొక డాన్స్ చేసేసానని తెలిపారు. ఆ తరువాత సావిత్రి గారు చెప్పిన మాటలు ఎప్పటికీ తను మర్చిపోనని చిరు తెలిపారు.

‘నాకు బాగా నచ్చావయ్యా భవిష్యత్తులో గొప్ప నటుడివి అవుతావు అన్న మాట తనకి అంతా ఇంతా కాదని నీలో ఎంతో స్ఫూర్తిని చూశానని చెప్పిన మాటలు నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చినట్టు అనిపించింది’ అని చిరంజీవి తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు