మెగాస్టార్ ప్లాన్ వర్కౌట్ అయ్యినట్టేగా..!

Published on Sep 16, 2020 7:04 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం తర్వాత చిరు ఒక రెండు రీమేక్ చిత్రాలను లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో తమిళ్ సూపర్ హిట్ వేదాళం రీమేక్ కూడా ఒకటి. తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి మాత్రం మేకోవర్ డిఫరెంట్ గా ఉండాల్సి వస్తుంది. అందుకే ఒక గుండు లుక్ తో ఉన్న ఫోటోను పెట్టి చిరు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేశారు అన్న విషయం కూడా రివీల్ చేసేసారు. కానీ ఆ చిత్రం మొదలు పెట్టడానికి చాలా సమయం ఉంది కదా ఇప్పుడే ఎందుకు వదిలారు అన్నది ఆరా తీస్తే..

ఫ్యాన్స్ తమ హీరోకు సంబంధించి లుక్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడరు. బహుశా అందుకు తగ్గట్టుగా వారి స్పందన ఎలా ఉంటుంది అన్న దానికి చిరు ఇలా చిన్న టెస్ట్ పెట్టారేమో అనిపిస్తుంది. అభిమానులు మరియు సినీ వర్గాలు నుంచి అనూహ్య స్పందన రావడంతో మొత్తానికి చిరు వేసిన ప్లానింగ్ మాత్రం స్యూర్ షాట్ గా వర్కౌట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :

More