పవన్ పొలిటికల్ ఇమేజ్ పెంచేలా,చిరు కామెంట్స్..!

పవన్ పొలిటికల్ ఇమేజ్ పెంచేలా,చిరు కామెంట్స్..!

Published on Nov 27, 2019 11:32 AM IST

pawan chiru

పవన్ ని తెరపై చూసి దాదాపు రెండుళ్లు పూర్తవుతుంది. ఆయన 2018లో సంక్రాంతి కానుకగా వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తరువాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమై పోయారు. ఐతే మళ్ళీ గత కొద్దిరోజులుగా ఆయన మూవీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం, కొందరు అభిమానులకు కిక్ ఇస్తుంది. పవన్ అభిమానులలో కొందరు ఆయనను మరలా తెరపై చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐతే పవన్ మళ్ళీ సినిమా చేయనున్నారనే వార్తలను ఏవిధంగా కూడా ఆయనఖండించలేదు. దీనితో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉన్న తరుణంలో సామాజిక అంశంతో కూడిన కథతో తెరకెక్కే సినిమాలో నటించే అవకాశం కలదని చాలా మంది వాదన.

సోషల్ కాన్సెప్ట్ తో మూవీ చేయడం వలన తన పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడే ఆస్కారం కలదు. కాగా పవన్ కళ్యాణ్ అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ కార్యక్రమాలలో పాల్గొంది లేదు. పొలిటికల్ గా ఆయనకు సపోర్ట్ గా మాట్లాడింది లేదు. కానీ నిన్న జరిగిన అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అర్జున్ సురవరం మూవీలో చెగువెరా సాంగ్ ఒకటి ఉందని, ఆ సాంగ్ చూసినప్పుడు నాకు తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారని చెప్పడంతో పాటు, పవన్ సింగ్నేచర్ మూవ్మెంట్ ఒకటి స్టేజి పై చేసి చూపించారు. జనసేన పార్టీ స్ఫూర్తి దాతలుగా చెగువెరా, భగత్ సింగ్ లాంటి ఉద్యమ వీరులను చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కాబట్టి చిరు పరోక్షంగా పవన్ పొలిటికల్ కెరీర్ కి సపోర్ట్ చేసినట్లైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు