లవ్ సీక్వెన్స్ కోసం రెడీ అవుతోన్న ‘కళ్యాణ్ దేవ్’ ?

లవ్ సీక్వెన్స్ కోసం రెడీ అవుతోన్న ‘కళ్యాణ్ దేవ్’ ?

Published on Aug 4, 2019 12:50 PM IST

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో గత ఏడాది తన రెండువ సినిమాని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే చిత్రబృందం ఇటీవలే ఇప్పటివరకు చిత్రీకరించిన ఫుటేజ్ ను చూసి.. స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేస్తే బాగుంటుందని భావించిన టీం.. షూటింగ్ కి విరామం ఇచ్చి.. ప్రస్తుతం స్క్రిప్ట్ పై మరియు డైలాగ్‌ లపై వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఈ వారంలో షూటింగ్ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పుడు చేయబోయే షెడ్యూల్ లో కీలకమైన లవ్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట.

ఇక ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమాతోనైనా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు