“మనం సైతం” ఆధ్వర్యంలో చిత్రపురి ప్రజలకు కోవిడ్ పరీక్షలు.!

Published on Aug 13, 2020 2:05 am IST


ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా మూలాన ఇప్పటికే చాలా మంది జీవనాధారం దెబ్బ తింది. ముఖ్యంగా సినీ కార్మికుల జీవితాలు కూడా మరింత స్థాయిలో ఛిద్రం అయ్యిపోయాయి. అయితే దాదాపు సినీ పరిశ్రమ అంతా హైదరాబాద్ లోనే ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే అక్కడ సినీ కార్మికులకు అంటూ ఉన్న స్పెషల్ గా నిర్మించబడ్డ “చిత్రపురి కాలనీ”లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలలో భయాందోళనలు పోగొట్టే దిశగా కరోనా పరీక్షలు వాహనం ద్వారా నిర్వహించినట్టుగా “మనం సైతం” కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేసారు. దీనితో వైద్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర జి హెచ్ ఎం సి వారి ఆద్వర్యంతో మొబైల్ టెస్ట్ సెంటర్ ను చిత్రపురిలో ఏర్పాటు చేశారు.

దీనితో చిత్రపురి నాయకులు వినోద్ బాల, వల్లభనేని అనిల్ బృందం సారధ్యంలో చిత్రపురి కాలనీ వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనా పరీక్షలు చేసుకొని ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More