భారీ అప్డేట్ కి సిద్ధమైన “చియాన్62”

భారీ అప్డేట్ కి సిద్ధమైన “చియాన్62”

Published on Apr 15, 2024 10:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ హీరో తదుపరి పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తంగలాన్ మూవీ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ విక్రమ్ పుట్టిన రోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ హీరో తదుపరి మూవీ చియాన్ 62(Chiyaan62) పై ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ ను చేశారు మేకర్స్.

ఈ చిత్రం కి సంబందించిన బిగ్ అప్డేట్ ఏప్రిల్ 17, 2024 న, అనగా మరో రెండు రోజుల్లో రివీల్ కానుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ లో హీరో విక్రమ్ కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. పోస్టర్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. సు అరుణ్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. దుషర మరొక కీలక పాత్రలో కనిపించనుంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు 17 వ తేదీన వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు