అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని పొగిడేస్తున్న తమిళ స్టార్ హీరో

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని పొగిడేస్తున్న తమిళ స్టార్ హీరో

Published on Nov 26, 2019 8:24 AM IST

sandeep

అర్జున్ రెడ్డి చిత్ర కథ…. అలాగే ఆ కథను సినిమా తీయాలనే ఆలోచన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కి ఏ క్షణంలో వచ్చిందో కానీ ఆ చిత్రం చాలా మంది జీవితాలను మార్చి వేస్తుంది. తెలుగులో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, హిందీలో కబీర్ సింగ్ గా మరో ప్రభంజనం సృష్టించింది.అక్కడ ఏకంగా 300కోట్లకు పైగా వసూళ్ళలో ఒక దశలో 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు అదే చిత్రం తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ కావడం జరిగింది. గత వారం విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం ఐయ్యారు. కాగా ఆదిత్య వర్మ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో హీరో విక్రమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు నటనను ఎంతో మెచ్చుకున్న విక్రమ్ ఈ చిత్ర కథకు కారకుడైన సందీప్ రెడ్డి వంగాను పొగడ్తలతో ముంచివేశారు. ఆయన రాసిన కథకు తన కొడుకు ధృవ్ ని అన్వయించుకొని చూశాను అన్నారు. ఇలాంటి అద్భుతమైన కథను అందించిన ఆయనకు కృతజ్ఞలు తెలిపారు. వర్సిటైల్ యాక్టర్ విక్రమ్ ప్రశంసలు అందుకున్న సందీప్ ని మెచ్చుకోవాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు